Kancharla Anil's "The Devil"

Loading...

Kancharla Anil's "The Killer"

Loading...

Bhayam the tense of fear by Kancharla Anil

Loading...

Love Never dies by Kancharla Anil

Loading...

You can win part- I (Kancharla Anil )

Loading...

You can win part-II (Kancharla Anil)

Loading...

Monday, September 21, 2009

My short movies...Kancharla Anil

Watch my short movies.....@

1.Bhayam -The tense of fear

http://www.youtube.com/watch?v=4wynBWIhjnE

2. Love never dies

http://www.youtube.com/watch?v=SdarIKsylkc

3.You can win by Kancharla Anil

http://www.youtube.com/watch?v=7p3D22k0VDs


And few more is under progress. I will update you later


Thanks & Regards

Kancharla Anil

Thursday, August 20, 2009

జీవితం -కంచర్ల అనిల్
కష్టాలలో ఉదయం
కష్టాలలో అస్తమయం
ఆయినా రెండిటి మధ్య కుదరని సమన్వయం
కొన్ని సార్లు జీవితం అంతే...
అసలేమి జరగనట్లు నటించాలి..
కష్టాలు ఏమిలేనట్లు కనిపించాలి ...
కన్నీళ్ళు కు ఎదురుతిరిగి ప్రతిఘటించాలి ..
లోలోపల గుండె పగిలిపోతున్న సరే..
తప్పదు సుమా!
చేయూత చేయి విడిచి వెళ్లి నప్పుడు
పడుతూనే నడవాలి...
పడిపోకుండా నిలవాలి ..
ఓడిపోతున్న గెలవాలి...
తప్పదు మరి ..
కనుమరుగైన అనురాగం కోసం
కలవరపెడుతున్న శ్వాసని
కలవరపడిన ఆశని
బందించి , నిందించి..
మదిలోనే సమాధి చెయ్యాలి ...
చేజారిన జీవితాన్ని వెదుక్కునే
చివరి మజిలీలో జీవితంలో కొన్నిసార్లు అంతే ...
మనసులో ఏడవాలిమనిషిలా ఏడవాలి ...
మనిషి కోసం ఏడవాలి ...
మనసు తో ఏడవాలి ..
హృదయానికి మాత్రమే వినిపించేలా ...
అంతం ఆరంభం ఉన్న జీవితానికి
సొంతం అంటూ ఏమి లేని దశలో
ఆశ ,నిరాశల మధ్య అంతరార్ధం ఏమిటో నన్ను చెప్పని...
మోహ వ్యామోహాల గుట్టు ఏమిటో నన్ను విప్పని ..
ఇప్పుడు కాలం_ దూరం భిన్న ద్రువాలు ...
ఎంత వేచిన గడవని కాలం ..
ఎంత నడిచిన తరగని దూరం ...
అన్ని తెలిసి ఎందుకు ఇంకా నిజానికి నీడకి మధ్య దాగుడుమూతలు ...
ఉహల దహల తీరని వేళ....
దేహం నన్ను అడిగే సందేహలెన్నో...
సంతోషం, సన్నిహిత్యం అదంతా గతం...
నేడేమో గతి తప్పిన బ్రతుకు చిత్రం ...
రెక్క తెగిన పావురం జీవితం...
లెక్క తప్పిన చైతన్యం జీవితం..
అనురాగపు అంతర్యుద్దంలో అనునిత్యం ఓడిపోతున్న
సమాదానం లేని ప్రశ్నలకు జవాబులు వెదుక్కునే ప్రయత్నంలో
చివరిగా....
దిక్కు తోచని నైరాశ్యంలో ....
నిద్రపట్టని రాత్రి ...
తెల్లారిన విడిపోని చీకట్లు ...
కలం రాస్తుంది ....
చీకటిలో....
ఆకటితో ..
"మనిషి జీవితం ఒక విష నాటిక ...
దాని జీవితకాలపు సంపాదన ఒక శవ పేటిక
చివరికది చేరేది స్మశాన వాటిక"....

Tuesday, July 21, 2009

నా హృదయపు గదిలో....కంచర్ల అనిల్

నా హృదయపు గదిలో....కంచర్ల అనిల్
మౌనం పెదవుల్లో ...
విస్పోటవం హృదయంలో..
రక్తపాతం లేని గాయాలు...
కన్నీళ్ళతో తడిసిన కలలు..
ప్రేమకు నువ్వు చూపిన ఆనవాళ్లు

ఉషోదయాల ఉషస్సులో ఉదయిస్తావు...
విషాదాల సరస్సు లో అస్తమిస్తావు...
కలల సామ్రాజ్యానికి ఉహల గుర్రాన్ని ఎక్కి వెళ్లిపోయావు...
నాలోని ఈ అలజడులకు ఆలోచలనలకు అంతం!
ఇక నీ జీవితం నీ సొంతం....
నువ్వు చేసిన గాయం మానదు.....
ఈ యదలో జ్వాల ఆరదు ...
పగిలిన హృదయం చెప్తుంది నీ పేరు ...
తొలి ప్రేమ కి ఫలితం ఈ కన్నీరు ....

నా హృదయపు గదిలో........
సగం చచ్చిన జ్ఞాపకాలు నీ ప్రేమకు సజీవ సాక్ష్యాలవుతాయి...

మీ
కంచర్ల అనిల్

గెలవ" నీ" జీవితం -కంచర్ల అనిల్

గెలవ" నీ" జీవితం -కంచర్ల అనిల్
ఫలసాయం అందని రైతువో.....
వలపు గాయం పొందిన ప్రియుడవో...
విరహ వేదనలో అలసిన ప్రేయసివో...
అనురాగం కరువైన అలివో...
సంసారం బరువైన తల్లివో...
నిరాదరణకు గురైన వృద్దుడివో .....
నిరుద్యోగం లో అలసిన యువకుడివో....
మోసపోయిన కూతురివో ...
రోషాపడ్డ కొడుకువో......

ర్యాంక్ లు, ఉద్యోగాలు
ఆశలు, ఆశయాలు ఇంతేనా జీవితం...
అవి తీరని నాడు అంతేనా ?????
నడిరాతిరి కలలో జీవిస్తూ....
నిజం నిద్రలేచిసరికి మరణిస్తూ ....

రాజీ పడవోయ్ ఈ రోజు ఓసారి....
రాజై ఎలాగలవ్ ప్రతిసారీ... ...
నిరాశతో నిండిన ఈ రేయి.....
చిదిమేస్తుందా నిన్నటి హాయినీ ..
అంతరాత్మ చెప్పలేదా ఆత్మహత్య నేరమని....??????
గమ్యం మరచిపోయినప్పుడు గతాన్ని అడిగిచూడు ఒక్కసారి...
చరిత్ర చెప్పిన పాఠం ఇదే ...జీవితం చివరివరకు పోరాటమే..
తనువుని తలగడగా చేసుకొని ....
కష్టాల కౌగిలి లో ఈ రాత్రికి నిద్రపో...
రేపు ఉదయం నీదే
తలచుకుంటే కానిదేముంది ఈ జగనా!
శ్వాశ ఉన్నత వరకు సమరమాపబోకు ఏ క్షణాన!
Be Alive
You Can Win...........
కవిత్వం నిండిన కన్నీళ్ళతో...కన్నీళ్ళతో నిండిన కవిత్వం తో
ఓటమి కాటుకి బలైన హితులకు, స్నేహితులకు చివరి వీడ్కోలు పలుకుతూ....

ఓటమి రహదారిలో ఒంటరిగా .....

కంచర్ల అనిల్

" మనసే ఒక ఋణం ....మహా దారుణం"-Kancharla Anil

ఒంటరితనపు వెన్నెల రాత్రి ...
మసకబారిన మనసుల మైత్రి ...
కావలసినదేదో కానరాని కన్నీళ్ళు.
అస్పష్టత నిండిన ఆవేదన ...

ఇంట బయట ఖాళీ మనస్సు...
పక్కనే ఎప్పుడు కన్నీళ్ళ సరస్సు...
చుట్టూ అమావాస్య లాంటి నిశి...
ఆపై దేవుడిమీద ఏదో తెలియని కసి ..

పెదవుల వెనుక నిశబ్దం ...
మనిషికి మనసుకి మధ్య నిశబ్ధం ..

చీకటి చెంగుని కప్పుకున్న చంద్రబింభం...
వేకువ రాకముందే వెళ్ళిపోయింది...

ఆశల నింగికేసి చూస్తున అతనికేమో
నేటితో ఆయువు తీరిపోయింది....

సానుబుతిగా గాలి వీస్తుంది...
వెన్నెల జాలిగా చూస్తుంది...
ఆగిపోయిన అడుగుకి ...
ఆరిపోయిన బ్రతుక్కి వెలుగు ఇవ్వలేక...
వీధిదీపం విసుక్కుంటుంది ...
యదనీడ లో ఉండలేని ప్రేమ ...
వెదికితే దొరకదు దాని చిరునామా...
మనో యుద్ధం లో గెలవలేని తనువు ....
మరణ శాసనం రాసుకుంది ....
అక్షరాలు ముక్కలై ...
ఆవేదన కన్నీటి చుక్కలై ...
ఈ నిమిషం నీకో విషయం చెప్పనా నేస్తం...

" మనసే ఒక ఋణం ....మహా దారుణం"

ఇది మరువలేని మనసు రాసుకున్న మరణ శాసనం ...
నిజమైన ప్రేమ ఎప్పుడు అందని ఆకాశం...
కవిత్వానికి కన్నీళ్ళకు కొంతకాలం సెలవిస్తూ.....

స్వచమైన ప్రేమకోసం చచ్చిపోయిన పిచ్చివాళ్ళందరికీ అంకితమిస్తూ...

Kancharla Anil

Thursday, May 7, 2009

మహా కవి శ్రీ..శ్రీ..గారికి జన్మదిన శుభాకాంక్షలతో

పేదోడి స్వేదానివై ...

కార్మికుడి నాదనివై ...

అనుగారిన వర్గాల వాదానివై ...

అభాగ్యుల పాలిట వేదానివై ...

అస్సహయుల ఘోషలో ఆవేశపు శ్వాసవై...

నిస్సహాయుల బాధలో అక్రోశపు రాతవై ...

జ్వలించే గుండెలో స్కలించే లావవై ....

అశ్రువులను అక్షరాలుగా...

కన్నీళ్లను కవిత్వంగా...

అనువదిస్తూ....

నీ కలం ఇక సామాన్యుని బలమై ...

సతమతాల సమాజాన్ని నిలదీస్తూ

శ్రామికుడి గళమై...అసమర్ధపు ప్రభుత్వం పై నినాదిస్తూ. ...

కర్షకుడి హలమై ...బండబారిన భూమిని మొండిగా చీలుస్తూ ......

విశాల భారతావని నుదిట నెత్తుటి తిలక్డం దిద్దగా

మళ్లీ ఎప్పుడు వస్తావ్ ప్రభు....

మేఘాలను దాటి...

రాగాలను మీటి ..

పంచభూతాలు ప్రళయ గీతాలు ఆలపించగా...

అష్ట దిక్కులు విలయ నాట్యం చెయ్యగా ...

శూన్యంలో నుంచు సుధీర్గ ప్రయాణం చేస్తూ...

దండెత్తి రా ప్రభు మా భూమికి ..

మరో ప్రపంచపు పరుగులలో విశ్రమించని కవివై ..

మహాప్రస్తానపు వెలుగులలో అస్తమించని రవివై ..

మహా కవి శ్రీ..శ్రీ..గారికి జన్మదిన శుభాకాంక్షలతో ....

<<<కంచర్ల అనిల్>>>

బి రెడీ ఫర్ ఎలక్షన్ గారడీ ..కంచర్ల అనిల్

అత్యాశపు అతివ అత్తరు గంధం పూసుకొని ..

ఉత్తర కుమారులతో కొత్త పరిణయానికి బయలుదేరినట్లు

ఉహకందని ఉత్పాతపు ఉల్క ఉప్పెనగాభూమిపైకి దూకినట్లు ...

ఐదేళ్ళకు ఒకసారి వాగ్దానాల ఉత్సవాలు జరుగుతున్నాయి ...

సందడిగా...

అంగడిగా...

నాయకులంతా నావికులై సమాజ సాగరాన్ని స్వలాభం కోసం పంచుకోవడానికి,

తుంచుకోవడానికి యాత్ర మొదలు పెట్టారు ..

నేడు వీధి వీధి నుండి విదూషకులు బయలుదేరారు ...

పూటకో మాట...

రోజుకో వేషం ..

మాయదారి మాటలు నేడు కొత్త అట నేర్చుకొని ..

ఎక్కడెక్కడో ఆడుతున్నాయి....

కోటలలో...

పేటలలో..

ఊళ్ళలో,నాయకుల నోళ్ళలో..

మద్యం మత్తులో తోడేళ్ళకి తాగుబోతుల తందాన...

తెల్లారి కళ్ళు తెరిచిచూస్తే బ్రతుకంతా చిందరవందేనా???

నేడు నాయకులంతా విలువల వలువలు విడిచేసి నగ్నంగా నర్తిస్తున్నారు!

నేడు అభివృద్ధి రధం ఆగమేఘాల మీద వేగంగా పరుగులు తీస్తుంది ..

సంక్షేమపు గుర్రం సన్యాసిలా ఊరురా తిరుగుతుంది..

ప్రత్యర్ధుల మధ్య చిచ్చు పెట్టి ప్రచార సాధనాలు పండగ చేసుకుంటునాయి..

వాగ్దానాల వాన కురవదు అని తెలిసిన రైతు నిరాశగా హలం తో పోలం వైపు కదిలాడు...

బ్రతుకు బాట నీ చూపలేని బజారు మాటలు ఎందుకని ..

నిర్వేదపు నిరుద్యోగంలో మునిగిపోయాడు ఓ యువకుడు ..

చాన్నాళ్ళుగా విన్న మాటలే మళ్లీ మళ్లీ వినలేక...

ముసుగుకప్పుకొని పడుకొంది ఓ ముసలి..

ఈ తిరుణాల ఏమిటో అర్ధంకాక దిక్కులు చూస్తూ ...

బుక్స్ తో స్కూల్ కి బయలుదేరాడు ఓ కుర్రాడు ..

జరుగుతున్నదేమిటో ...

దాని వాళ్ళ జనానికి ఒరుగుతున్నదేమిటో తలపట్టుకొని కూర్చున్నారు తత్వవేత్తలు...

ఎన్నడూ ఉళ్ళో కాలు ఆయినా పెట్టని నాయకుడు నేడు చేతులు పట్టుకొని అడుక్కుంటుంటే ...

నడమాంత్రపు వినమ్రత చూసి ....సామాన్యుడు బిత్తరపోయి చూస్తునాడు ..

రకరకాల వర్గాలు...పలురకాల ప్రాంతాలు ..

ఆయినా ఒక్కటే మొహం అదే పదవి వ్యామోహం ..అంత అభివృద్ధి అన్న వింత వాదనను చూసి ..

ప్రజాస్వామ్యం ప్రభాత నీరాజనం లో పగలబడి నవ్వుతుంది

మేకలమంద లాంటి జనం మూకలకి చివరిగా ఓ నిజం చెప్తుంది ....

నీ స్వార్ధం మానుకొని..నిస్వార్ధం గా ఓటెయ్యి ..

సమసమాజపు సౌధం నిర్మాణానికి రాళ్ళుఎత్తే కూలివై ! <<<కంచర్ల అనిల్>>>

నువ్వు లేని ఈ శూన్యం లో రోదించని! ....

నిశబ్ధాల నది పై అపార్ధాల వంతెన నిర్మించుకుని ....

"నువ్వు" ఆ వైపు “నేను" ఈ వైపు నిలుచున్నాం..........

"నువ్వు" వస్తావని "నేను" ....."నేను" పిలుస్తాను అని "నువ్వు"

...మౌనమనే గాయమేదో చేసుకొని ..మరమనుషుల లాగా జీవిస్తున్నాం ....

ఈ మౌనం చేసిన గాయం తీరదు ....

నా వేదన నీకు చేరదు ...

హృదయాల మధ్య దూరం కొలిసింది ఎవరు.....???

కనురెప్పల మాటున స్వప్నంరూపం చూసింది ఎవరు...???

ఒక్కసారి నా గుండె చప్పుడు విను నేస్తం....

నా మనసులోని మౌనం మాటలు గా మరి నిన్ను వెల్లువలో ముంచేస్తుంది ....

ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నేస్తం....

కలల నిన్ను కన్నీళ్ళ లో తడిపేస్తాయి .....

నిజమైన ప్రేమను తలచుకున్న ప్రతిసారీ నువ్వే గుర్తొస్తుంటే ....

నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారీ కళ్ళకి నీళ్ళువస్తుంటే ...

నువ్వు లేని ఈ శూన్యం లో రోదించని! ....

నీ తలపులతో చివరివరకు జీవించని! .

****కంచర్ల అనిల్****

Thursday, February 26, 2009

పితృదేవోభవ ......కంచర్ల అనిల్

సమయం సాయంత్రం 7 గంటలు .....
నగరం కంగారుగా పరుగులు తీస్తుంది ..
ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నా ఒక కుర్రాడి జీవితంలో
విషాదఛాయలు అలుముకోనున్నాయి అని తెలిదు కాబోలు...

ఇంతలో చెల్లి ఫోన్ ....
ఏదో న్యూస్ ఉండే ఉంటుంది లేకపోతె చెల్లి ఫోన్ చెయ్యదు అనుకుంటూ....
సెల్ ఫోన్ లిఫ్ట్ చేశాను ....
మాటలకూ బదులు ఏడుపులు వినిపిస్తునాయి....

ఏమైంది?? ఏమైంది?? అని రెచ్చిన ఆందోళనతో అడిగాను....
వణుకుతున్న స్వరంతో చెల్లి నాన్న చనిపోయారు అని చెప్పింది....

అంతే...
వెయ్యి మైళ్ళ వేగంతో వస్తున్నా రాకెట్ లాంచర్ ఏదో గుండెల్లో గుచ్చుకున్నంత బాధ....
నా ప్రమేయం లేకుండానే చాల సంవత్సరాల తర్వాత కన్నీళ్ళు ధారాపాతంగా వస్తునాయి....
అ కన్నీళ్ళ నుండి వచ్చిన కొన్ని కవితాశ్రువులు......

నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న!
నిర్దయగా ఈ నేల పైన ....

ఎంత అన్యాయం చేసావ్ దైవం ....
నా గుండె పగిలింది ఇది నిజం.....
నీకు నాకు నడుమ ఎన్ని వేల అనురాగాలు....
అన్నిటిని తెంచివేస్తూ..శోకంలో ముంచి వేస్తూ....
ఎందుకు ఇంత ఘోరం చేసావ్ దైవం...

ముళ్ళ బాటలో ముందుగ నడిచి...
కష్టాల వానలో కడవరకు తడిసి...
వెలకట్టలేని మమతలు ఎన్నో పంచావు...
నేడోమో అందరిని విషాదాల సరస్సులో ముంచావు...

ఒక్కసారి చూడు నాన్న నీకోసం వందల మైళ్ళు దాటివచ్చాను...
కొన్నివేల ఉసులూ మోసుకొచ్చాను....
నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న!
నిర్దయగా ఈ నేల పైన ....

నీకు నాకు నడుమ ఎన్ని వేల జ్ఞాపకాలు నాన్న ...
జ్ఞాపకాల చలమను తవ్వే కొద్ది నీళ్ళు... కన్నీళ్ళు..... ఉభికివస్తునాయి....

మనిద్దరం గేదెల సంతకి 24 కిలో మీటర్లు నడిచి వెళ్ళడం నాకు ఇంకా గుర్తు ఉంది నాన్న...
నన్ను 6 తరగతి లో హాస్టల్ లో జాయిన్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు నేను బయపడి ఏడుస్తుంటే....
నా చెయ్యిపట్టుకోని మీరు ధైర్యం చెప్పే క్షణాలు నా మదిలో పదిలం నాన్న...
అప్పటిదాకా హాస్టల్ లో బిక్కు బిక్కుమంటూ ఉన్న నాకు ...
రెండవ శనివారం మీరు రాగానే కొండత ధైర్యం వచ్చేది..
అ ధైర్యమే ఇప్పటిదాకా ఎన్ని కష్టాల్లో ఉన్న నన్ను నడిపిస్తుంది కదా!

ఎన్నో సార్లు ఎంతో మందికి ధైర్యం చెప్పిన నా మాటలు....
నేడు అధైర్యపడి అంతరంగపు లోతుల్లో దాక్కున్నాయి....

నేను డిగ్రీ లో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను చూడడానికి ప్రతివారం వస్తుంటే...
స్నేహితులు పిచ్చి అనుకునే వాళ్ళు.....
మీ పిచ్చి ప్రేమ నాకు తప్ప ఎవరికీ అర్ధం అయ్యేది కాదు...

నాన్న మనిద్దరి సంబాషణలో మౌనమే ఎక్కువ మాట్లాడేది ...
ఎక్కువ మాట్లాడం మీకు ఇష్టం ఉండదూ...
మీకు ఎదురు మాట్లాడం నాకు ఇష్టం ఉండదూ...
మీకు ఎన్నో విషయాలు చెప్పాలనిపించేది నాన్న....
మౌనం నా మాటలను కప్పేసేది...

నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న!
నిర్దయగా ఈ నేల పైన ....

నాన్న నేను నీకు ప్రతి నెల 5 తారీఖు జీతం డబ్బులు నీకు పంపి
ఫోన్ చేస్తాను చూడు నాన్న....అప్పడు నాలో వచ్చే సంతోషం
అంతకు ముందు నేను పడిన కష్టాన్ని అంత చేరిపెసేది నాన్న ...
ఇప్పుడు ఆ జీతం ఎక్కడికి పంపాలి..ఎవరి పంపాలి....
మళ్లీ అ సంతోషాన్ని ఎంతఇచ్చి కొనుకోవ్వాలి ...

మీరు పంచిన ప్రేమను ఇచ్చేదెవరు....
నా కోసం అన్ని కొనితెచ్చేదవరు

ఓటమి ఎన్నో సార్లు నన్ను ఎదురువచ్చి మరి వెనక్కి నెట్టింది..
పడ్డ పట్టువదలని నన్ను చూసి ఈ సారి కసి తో గుండెలపై కొట్టింది...

నాన్న !
నువ్వు కష్టాల ఉబిలో దిగబడి..
నీ భుజాల పై నన్ను నిలబెడితే...
నేనోమో నీ భుజాల పై నిలబడి...
ఆకాశం వైపు చూస్తూ అందనిదాన్ని అందుకోవాలని ఆశ పడేవాడిని...
నువ్వు ఎప్పుడు అవసరాల సముద్రానికి అభిముఖంగా అడుగులు వేస్తుంటే ...
నేను ఆశల సాగరం వైపు అడ్డదిడ్డంగా పరుగులు తిసేవాడిని ....

నన్ను వదిలి వెళ్ళిపోయావా నాన్న!
నిర్దయగా ఈ నేల పైన ....

చిన్నప్పుడు చెల్లి, తమ్ముడు మీరు తిడతారు అని ...
వాళ్ళిద్దరూ అమ్మ పార్టీ అంటూ...
నన్ను మాత్రం నీ పార్టీ లో చేర్చేసేవాళ్ళు కదా నాన్న!

అప్పటినుంచే నా గుండెల్లో మీరు...
మీ గుండెల్లో నేను ఎప్పటికి ఇలానే ఉంటాం అని అనుకునేవాడిని...
అదంతా అబద్దం అని ఇప్పుడే తెలిసింది నాన్న....

ఎన్నో అబద్దాల్ని నిజం అని నమ్మిన నేను...
మీరు లేరు అన్న వాస్తవాన్ని మాత్రం నమ్మలేకపోతున్నాను ...

చీరాల రైల్వే స్టేషన్ ఎప్పటిలాగా ప్రయాణీకుల తో కళకళలాడుతుంది ...
ఎవరి తొందరలో వాళ్ళు ..
ప్లాట్ పాం నె.3 నాకు బాగా గుర్తు నాన్న....
పేదరికపు రక్కసి కోరల నుండి వికృత చేష్టల నుండి...
పారిపోవడానికి నా పరుగు మొదలు ఇక్కడే ....
మళ్లీ అక్కడే ఆగిన మీ చివరి అడుగు...
ఎవరికీ కావాలి నాన్న ఉపిరి ఆగిపోయి నువ్వున్నా!
నువ్వు ఆగిన అరుగు దగ్గర ఆగలేదు ఏ అడుగు..
ఎదుటవారి శ్రేయస్సు కోరని సమాజం వేశ్య లాగా ఇంకా దేనికోసమో ఎదురుచూస్తుంది ...

వెదవ లంజకోడుకులు చాస్తేనే వెక్కి వెక్కి ఏడిచే దుక్కుమాలిన మాలిన సమాజం...
నీ కోసం ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయింది...


చీరాల ఏరియా ఆసుపత్రి అప్పటిలాగే రోగులతో విలవిలడిపోతుంది...
ఎవరి బాధల్లో వాళ్ళు ...ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు ....
కళ్ళవెంట నీళ్ళు రాని మీరేమో శవాల గది లో సుఖమైన నిద్రలో ఉన్నారు..

శవాల గది లో సాయంత్రం లాంటి ప్రశాంతత ..
శవం లా మీరు మీ ఎదుట జీవచ్చవం లా నేను...
స్మశాన నిశబ్దం మనిద్దరి మధ్య.....
కన్నీళ్ళు మాత్రమే పారుతున్న శబ్దం ....

నీళ్ళు వస్తాయో రావోనన్న అనుమానం తో ఎలుకలు కసితీర కొరికి చూసాయి ....
అవి రావని తెలుసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయాయి...
మీ కళ్ళలో నిప్పులే కానీ నీళ్ళు రావు నాన్న ....నాకు తెలుసు కదా!
డాక్టర్లకి డబ్బు జబ్బు ముదిరింది ....
ఖాకీలు కర్తవ్యం వళ్ళుఅమ్ముకోవడం ఇంకా మానలేదు...
కట్టలు తెంచుకున్న ఆవేశానికి ....
కన్నతల్లి కన్నీళ్ళు అడ్డుకట్ట వేస్తుంటే ....
ఉద్వేగపు ఉన్మాదం లో ఏమి రాస్తున్నానో ....ఏమి చేస్తున్నానో తెలియని స్థితి...
పొరపాటుగా ఎవరిని ఆయినా తిడితే క్షమించు నాన్న!

ఎంత రాసిన నాకు ఇంకా రాయాలన్న మక్కువే!
మీ గురుంచి ఏమి చెప్పిన తక్కువే...

అయన కష్టాల కొష్టంలో కాపురం చేసిన కర్షకుడు....
మంచితనం మూటని ఎక్కడ దించని ముఠా కూలి ..
దగా లేని గేదెల దళారీ...
రాళ్ళల్లో రుదిర సేద్యం చేసిన రైతు బిడ్డ....
గరళాన్ని గొంతులో దాచిన పరమ శివునికి ప్రతిరూపం...
అన్యాయాన్ని దండిచడం లో,అక్రమాన్ని ఖండిచడం లో అయన ఒక కలం పట్టని శ్రీ... శ్రీ..
అయన చెడు పాఠాల బడిలో చదువుకొని బడ్డుద్డాయి ...
అయితేనేమి ఆయనకి జీవితం ఎన్నో పాఠాలు,గుణ పాఠాలు నేర్పింది...
కులాల కోసం మతాల కోసం కొట్టుకు చచ్చే వెదవ లంజకొడుకులు ఎందఱో ఉన్న
ఈ విషాద సీమ లో....
అయన మాత్రం ఎప్పుడు అందరివాడే....
కులాల కలరా కానీ మతాల మశూచి కానీ ఎప్పుడు అయన దరి చేరలేదు....

25 సంవత్సరాలు గా
అనురాగం,అప్యాయతలే అక్షరాలుగా ...
నువ్వు నేను కలిసి రాసుకున్న "భంధం" అనే గ్రంధం ...
నేడు యముడు అనే దేవుదేవడో చితి మంటల్లో
కాల్చేస్తుంటే మనసు చిద్రమైపోతుంది నాన్న ...

ఎప్పుడు నువ్వు తిడితే ఏడ్చే అమ్మ ...
ఇరోజు నువ్వు ఏమి అనకపోయినా ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే గుండె ముక్కలైపోతుంది నాన్న..
ముక్కలైన గుండె నలుదిక్కులా గుచ్చుకుంటుంది ....
దిక్కుతోచని తనువు మరణ మహాసముద్రం లో మునిగితెలుతుంది ...
నిన్ను పోగొట్టుకున్న భూమి వివస్త్ర ఆయినా" స్త్రీ"లా ఏడుస్తుంటే....
నీ రాక కోసం ఆకాశం అర్ధనగ్న నృత్యం చేస్తుంది...
నువ్వక్కడ నిప్పుల్లో పడుకొని చూస్తుంటే....
నేనిక్కడ కన్నీళ్ళ లో ఉపిరాడక చస్తున్నా ...
వికలమైన మనసులోని శకలాలన్నీ పోగుచేసుకోవాలి....
పగిలిన గుండెను కన్నీళ్ళతో అతికించుకోవాలి...
విషాదమైన బ్రతుక్కి వినోదపు రంగు పూసుకోని ....
కడుపు నింపుకోవడం కోసం మళ్లీ పరుగులు మొదలు పెట్టాలి...

మీ చూడని కన్నుల వెనుక నేను చూడాల్సిన స్వప్నాలు కనిపిస్తునాయి...
మీఆగిన అడుగుల వెనుక నేను చేరాల్సిన లక్ష్యాలు కనిపిస్తునాయి...

మీరు ఇచ్చిన ఉపిరి నాలో ఉంది ....నాతోనే ఉంటుంది....
మీ భావం గ్రహించి...
మీ నామం స్మరించి ....
మీరు ఆపిన యుద్ధం ....
నేను సాగించడానికి సిద్ధం....
ఆత్మగానైన అవహించు నాలో....
అనునిత్యం నడిపించు ఇలలో..
పేదరికానికి పరమయోదునికి మధ్య జరిగిన చివరిపోరు నేటితో ముగిసింది ..

వంచన నిండిన ఈ లోకం లో ఉండలేని నీ ఆత్మ....
మనః సామ్రాజ్యపు తలుపులు తెరుచుకొని మహాప్రస్తానమొందిది.
కర్మ భూమి లో ధర్మరాజులా పడుకొని ఉన్న నిన్ను చూసి ..
చితి మంటల చివరిచూపుల్లో" పితృదేవోభవ" అనే పదానికి కొత్త అర్ధం కనిపించింది..


నా దైవం,నా ధైర్యం ఆయినా మా నాన్న గారికి నేనిచ్చిన అక్షర(అశ్రు) నివాళి ...
అంకితం:- నా పితృదేవులు కంచర్ల ఆదినారాయణ గారికి అంకితం ...
కంచర్ల అనిల్




Saturday, January 24, 2009

నేటి భారతం(Sach Boltahu Main)--- కంచర్ల అనిల్

ఓ...
మహాకవి
ఏమని చెప్పాను నేటి భారతావని దుస్థితి ...
ఉగ్రవాదం....
రక్తపాతం ...
స్వార్ధం...
పదవి వ్యామోహం
అవినీతి సంపాదన.
అక్రమార్జన .


నపుంసక నాయకులూ....
అవినీతి ప్రభుత్వాలూ ..
దోపిడిలు… దొమ్మీలు...
అమ్మకానికి అమ్మాయిలు ..
అంగట్లో రౌడీలు...

ప్రతి ఒక్కడికి తన స్వార్ధం....
అదే ఇక్కడ పరమార్ధం...
న్యాయానికి లేదు అర్ధం..
సగటు మనిషంటే పనికిరాని వ్యర్ధం...


"షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై".....

ఒకడు చాస్తే ఒకడి మోదం మరొకడికి ఖేదం ...
చావూ బ్రతుకుల మధ్య లేదు పెద్ద భేదం ...

స్వరాజ్య దేశం లో స్వతంత్రం కరువు....
ఎవ్వరికి చెయ్యను ఏకరువు ..

ప్రజాస్వామ్యం పాలకుల చెంత పడుపుగత్తె ...
కర్తవ్యం అధికారం దగ్గర ఉంపుడుగత్తె.

కులాలకోసం కురుక్షేత్రాలు ...
మతాల కోసం మారణహోమాలు .....
దేశమంతా మతాల మబ్బులు కమ్మి ..
కులాల కుంభ వృష్టి కురుస్తుంటే
ప్రజాస్వామ్యం కొట్టుకుపోతుంది పారే నీళ్ళలో ...
ఆపై ఇక చేరునేమో పేదల గుడిసెల్లో .....


"షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై"....

గతమంతా బహిర్గత శత్రువుల మయం...
ఇప్పుడేమో అంతర్గత శత్రువుల భయం...
ఘర్షణలు ఏవైనా గాయాలు మనకేగా...
అర్ధంకదా మతాలకు ఏమైనా ????

ప్రతివాడు ప్రజాసేవ అని పార్టీలు పెట్టి...
ప్రజాధనం మూటగట్టి...
పేదోళ్ళ పొట్టలు కొట్టి...
నోటు తో ఓట్లు కొనగా బయలుదేరిరి...
ప్రతివాడు స్వార్ధ నాయకుడే...
పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఒక్కడు కూడా లేరు...

అంతా అవినీతిదే రాజ్యం.
క్షేమం ఇక అవిభాజ్యం..


"షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై"....

అమ్మకాలు అన్ని కల్తీ...
ఒక్క అమ్మపాలు తప్ప...

దేశం నలుగుచెరగుల విధ్య, వైద్యం వ్యాపారం ....

ప్రతిభ అంటే అమ్ముడుపోని వస్తువుకి ఆకారం.

కాలేజిల్లో దారితప్పినభోధన...
దొరకునా ఆత్మహత్యల ర్యాంకుల తీరునా ????
కళాశాలలో ర్యాగింగ్ భూతాలు...
విజ్ఞాపు వెలుగులలో సైతం వీడని అజ్ఞానపు అందకారాలు.....

చీకటి చాటున ఆరుతున్న ఆకలి బ్రతుకులు...
కనిపించని దేవుడుకేమో బంగారు తొడుగులు...
ఆ చీకటి భక్తి చెయ్యదు సాయం ...
తెలుసుకోరేమి ఇకనైనా ఈ నిజం..
దైవం ఒక విలాసవంతమైన సరుకు..
డబ్బున్నవాడికే మాత్రమే అది దొరుకు...

"షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై"....


నక్షత్రాల హొటల్లో నిషాని నాయాళ్ళు ...
పబ్లిక్ గార్డెన్స్ ఇక ప్రతిభావంతుల ఇల్లు ..

ఏది ఓటమో ఏది గెలుపో తెలియని ఆటలో...
ఆశయానికి అర్ధం మారుతున్న వేటలో ....
ప్రాణాన్ని పోరాటానికి ఉపిరి చేసిన అన్నలు కొందరే..
అన్నలమంటూ అగాయిత్యాలు చేసే పెద్దన్నలు ఎందరో..
కర్తవ్య నిర్వహణ కన్నులు మూసి కన్నా వాళ్ళ ని కన్నీళ్ళలో
ఖైదు చేసిన ఖాకీలు కొందరే....
కన్నతల్లి లాంటి కర్తవ్యాన్ని నల్లబజారు లో
నిట్టనిలువునా అమ్మే వాళ్ళు ఎందరో...

అవినీతి పునాదులపై అక్రమాల అంతస్తులని కట్టుకొనే
అవరగాళ్ళు ఎందరో....

షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై.....

చెత్త కుండీలో శిశువులు ...
తప్పుచేసినా ప్రతివతలు ఎందరు ???...
తనువుతో అట తప్ప మనువుమాట
ఎరుగని మగపురుగులుఎందరు ???....
మూడు రోజులకే మమకారం మట్టిపాలు....
ఆపై తిరిగి ప్రియునితో మురిపాలు..

యువత ఇక్కడ మద్యం మత్తులో..
భవిత మాత్రం ఎక్కడో...

ఓటమి గుండెలో రగిలిన వేదన....
మద్యం మత్తులో కరుగునా?

"షరాబ్ తో పీయ నహి ....
ఫిర్ బి సచ్ బోల్తహూన్ మై"....


చరచబడ్డ ఆడదాని తీరుగా శిదిలమై రోదిస్తున్న న్యాయం ...
వగలాడి వరద గోదారి లా పొంగిప్రవహిస్తున్న అన్యాయం ...

తెలిసిన వాడు న్యాయంచెప్పలేని పరిస్థితి...
చెప్పేవాడికి న్యాయం తెలియని స్థితిలో ...

సామాన్యుని స్వరం మూగబోయింది...
చైతన్యం అక్కడే ఆగిపోయింది..

చలి లో నాలో రగిలిన వేదన...
చలిమర గదులకు ఇక చేరునా....????

నిశా స్మశానం లో నివురుగప్పిన నిప్పునై రగిలిన....

రేయి చాటు రేపటిలో ప్రజల కనువిప్పుకై వెలిగిన...

అక్షరాలు అశువులు బాసిన అసహాయుల రోదనలో
పదాలు పరమపదించిన పీడితుల వేదన లో

గురూజీ నీతోనే చెప్పుకోవాల్సిన

గుండెపగిలే నిజాలెన్నో ఉన్నాయి....

ఈ విషాదాల సీమ లో, విభేదాల భూమి లో

రక్త బీజాలు నాటి...
బాష్పజలం తో తడిపి...
రుదిర సేద్యం చెయ్యి ..

రామరాజ్యానికి దారులు తియ్యి

మళ్లీ ఎప్పుడు ప్రభు మరో మహా ప్రస్తానం ....
అన్యాయం గుండెల్లో అలుపెరుగని ప్రయాణం ...


విభేదాల, విషాదాల
వివాదాల, విలాపాల..
మానవత, అసమానతలను
చేరిపెయ్యగా.....
కార్మిక, కర్షక శ్రామిక శక్తులను ఒక్కటి చెయ్య...


దండెత్తి రా ప్రభు మరో "ఖడ్గసృష్టికి" ......

అక్రమాల భూమిని ముంచెత్తగా "అస్రవృష్టికి" ...



*******కంచర్ల అనిల్********

Monday, January 5, 2009

శ్వాస ఉన్నత వరకు సమరం అపబోకు ఏ క్షణనా

"మేఘమా జారిపోకు చిరుజల్లు కురిసే వరకు .....
పుష్పమా రాలిపోకు నవవసంతం వచ్చే వరకు
ఆశయమా అలసిపోకు అనుకున్నది గెలిచేవరకు ....
కానిదేముంది ఈ జగనా.......
శ్వాస ఉన్నత వరకు సమరం అపబోకు ఏ క్షణనా" .........


కంచర్ల అనిల్
(సదా మీ ప్రేమకు బానిసను)

అగ్నిసాక్షి గా వేసిన అడుగుల పయనమెటు..కంచర్ల అనిల్

సంతోషాన్ని మరచి...
సమస్యలని పెంచి ....
మమకారాన్ని ముక్కులుగా పంచుకుంటే....
అనురాగాన్ని అపార్ధాలతో తుంచుకుంటే..
అగ్నిసాక్షి గా వేసిన అడుగుల పయనమెటు....
వేదమంత్రాలు చెప్పిన మార్గం దారెటు...
అర్ధవంతమైన సంసారాన్ని అర్ధంతరంగా ముగించి ......
అర్ధంలేని ఆవేశం తో ఆప్తుల మాటలు మరచి...
ఏలిన వాడి వ్రేలిని విడిచి....
వాడి వాడి గా ముందుకు సాగితివి...
ఎదురీతకా ??
యద కోతకా ??
లేక
విధి రాతక??
ఎవ్వరికేరుకా?
ఏ దారిని చేరును నీ నడక ???
కడదాకా కలిసిఉంటామని కళ్యాణ మంటపంలో చెప్పిందంతా అబద్దమేనా ????
కళ్ళెదుట జరిగింది ఇక నిజమేనా ???
విడాకులతో విడిపోతే ఇరు గుండెల మంటలు అరునా??
విడి విడి గడపలతో జీవిస్తే మునుపటి జీవితం ఇక సాగునా??
కన్న కలలన్ని కాగితాలతో వేరుచేసే....
సంతోషాన్ని సంతకాలతో దూరం చేసుకొని ..

అన్నిటి పంచుకొని....
పవిత్రబంధాన్ని తెంచుకొని...
విడిపోయి సంతోషిస్తారో ....
సంతోషం తో విడిపోతారో .......
ఇక
మీ ఇష్టం ...
కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ....
మీ గురుంచి కాదు....

మీ పిల్లల గురుంచి....వాళ్ళ భవిష్యత్ గురుంచి

( సారీ ఇది కవిత్వం కాదు ...ఎగ్జామ్స్ రాయటానికి ఇంటికి వెళ్ళినప్పుడు అపార్ధాలతో విడిపోయిన విద్యావంతులైన ఒక జంటను చూసి .....ఎందుకో చెప్పాలనిపించింది).

********కంచర్ల అనిల్*********

Wednesday, December 17, 2008

"నువ్వు" ----"నేను"--- కంచర్ల అనిల్


****** నువ్వు *******


తోలి సంధ్య వెలుగు లో .
తోలి పొద్దు పొడుపు లో ..
చిరుగాలి వై నను తాకితే..
నీ తలపు తో
నాలోని వలపు నిద్ర లేచింది..
నీ పిలుపు కోసం ఎదురుచూసింది ..
నీ పిలుపు విన్న నా మనసేదో

నీ చిరునవ్వుల జాడలు వెదుకుతుంటే..
అడగడుగునా నీ జ్ఞాపకాల గోడలు ఎదురోస్తున్నాయి .

నిరాశగా నే వెనుదిరుగుతుంటే ...
నువ్వు అవతలి వైపు నిలబడి నవ్వుతావు..

విరహాల వల వేసి నీ దరహాసాన్ని బందిస్తా ...
నీ రూపాన్ని కన్నుల్లో దాచేస్తా ...

నువ్వు ఆడిన ఈ వలపు అ(వే)ట లో

"కాల"మనే "గాల"మేదో నిన్ను_________ నన్ను వేరుచేస్తుంటే..

అనితరమైన నీ ప్రేమ జ్వాలల్లో .....
స్వప్న సౌధం కాలిపోయి కులిపోతుంటే...

బాషకందని భాష్యనివై
వెలికిరాని భావనివై ...

"కల"యిక ఇక "కల" అంటూ....
చెలిమికి సెలవంటూ..
చెరగని గాయమేదో చేసి వెళ్ళిపోయావు..

నా కన్నుల్లో బందించిన నీ రూపం
కన్నీరు గా కరుగుతుంటే..

నేలరాలిన కన్నీటి బొట్లు
నీకేసి జాలిగా చూస్తుంటే..

కన్నీటి నీటి తో ముఖం కడుకున్న చెట్ల ఆకుల్లోంచి
అప్పుడే పుట్టిన సీతాకోక చిలుక లా...

నువ్వు నా నుండి దూరం గా వెళ్లిపోతుంటే..
దాడి చేసిన దూరపు ఓడి లో

నిదుర రాని "శోకం"లో..
నువ్వు లేని ఈ "లోకం" లో....

"శిల" గా
చెరిగిన "కల" గా



****** "నేను" ******

-------- కంచర్ల అనిల్-------

Saturday, December 13, 2008

నిశీ రాత్రి శశిరేఖా కై సాగిన నా అడుగు...

మంచు కరిగిన?? ....మనసు విరిగిన?? .....
నువ్వు లేనిదే శ్వాస ఆడదు ....
నీ ఉహ లేనిదే బ్రతుకు గడవదు .....
"చలి"గాలి కి నే కప్పుకున్న "చెలి" ఉహల దుప్పటి...
"కల"త నిద్రలోని "కల"ల తుపాను లో కొట్టుకుపోయింది...
బ్రతుకంతా ఇక "శూన్యం" ....ఆయినా ఆగదులే నీ "ద్యానం"
చీకటితో నే చెప్పిన ఊసులు నీ చెవి చేరేనా???
శూన్యంలో నే రాసుకున్న రాతలు నీ మది చదివేనా ???
నీ నవ్వుల్లో నా రేపటిని .....
నీ ఉహల్లో ఈ చీకటిని తలచుకుంటూ, తలపోసుకుంటూ ....
నిశీ రాత్రి శశిరేఖా కై సాగిన నా అడుగు...
దూరమెంతో పగిలిన నా యదనడుగు……

కంచర్ల అనిల్

Saturday, December 6, 2008

మరి నీ కోసం మిగిలింది ప్రాణం శిలగా..*కంచర్ల అనిల్*


నీలి కన్నుల్లో సాగరాలే పొంగుతున్న ఆరిపోదు ఈ ప్రేమ జ్వాల ..

నిండు గుండెల్లో ఆశలల్ని అవిరావతున్న కరిగిపోదు ఈ ప్రేమ కల ..

నిప్పుల్లో నడిచింది కలం కలగా..

మరి నీ కోసం మిగిలింది ప్రాణం శిలగా..

కానరాని చికటిలోన, దారిలేని అడవులలోన,

కరుగుతున్న మంచులోన నే తిరుగుతున్న

అనుక్షణం నే వెదుకుతున్నా!

ప్రతిక్షణం నే బ్రతుకుతున్నా!

చిగురులు తొడిగిన చెమిలిమిని తుంచే నేస్తాలు..

చితి మంటల శ్రుతులను పంచే సాక్షాలు ..

అలసట తెలియని అలలుగా ఎగిసిన నా వలపు!

కలవని దిక్కులను కలపడమే దాని గెలుపు!

ఇది తరగని తపనలతో కలవని మనసుల పోరు..

కలిమికి బలిమికి బెదరని ప్రేమ తీరు..

కన్నీటి కలల యద హొరు ....

ఒంటరినై నీ విరహపు మంటలలో నే బ్రతుకుతున్నా!

ఓ దూరమా......... ఓదార్చుమా ....

ఓ శూన్యమా........ ఓడిచేర్చుమా ....


కంచర్ల అనిల్

Friday, December 5, 2008

కత్తి పట్టగా సంశయమెల????????

కత్తి పట్టగా సంశయమెల????????

కరుకు గుండెలతో ఇంకా స్నేహమెల????????

విజయ్ సవాల్కర్ చాతి లో బుల్లెట్ .....

చూపలేదా నీకు శత్రు గుండెల టార్గెట్...

చెప్పలేదా వెళ్ళాల్సిన రూట్ ఎటో .....

కత్తి పట్టగా సంశయమెల????????

కరుకు గుండెలతో ఇంకా స్నేహమెల????????

చలి లో ఆకలి తో ఇసుక లో విచారాన్ని శిల్పం చెక్కిన సుదర్శన్ పట్నాయక్ ఆక్రోశం అర్ధం కాలేదా నేస్తం ...

ఆవేశం తో ఇకనైన అపలేవా ఈ యుద్ధం ....

కట్టి పట్టగా జాగేల .....

క్రూర మృగాలను కత్తి కో కండగా నరకగా రావేలా ?????

మమకారం "గుర్తొస్తే" ....

ఓ నిమిషం మనిషివన్న సంగతి "మర్చిపో"....

అధికారం ఆపేస్తే.....

యుద్దానికి అటువైపు నుండి తరలిపో..

హింస లో కూడా అహింస వదలనంటావా ????

మంచితనానికి మరో రూపం మనమంటావా ?????

మంచితనాన్ని మనసు పొరల్లో కప్పేసి..

కరుణ ని కన్నీళ్ళతో ఖైదు చేసి ....

గరళాన్ని గొంతు లో నింపుకున్న పరమ శివునిగా మతోన్మాదాన్ని తెగ నరకగా ....

తరలి రావేరా??????

పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్ తో దోస్తీ గిస్తి "నై" ...

ఉగ్రవాదం పై యుద్ధంనికి మేము " సై"

చూస్తావా పాకిస్తాన్ కొడకా ....

ఇక భారతీయుల తడాఖా

కట్టి పట్టగా జాగేల .....

క్రూర మృగాలను కత్తి కో కండగా నరకగా రావేలా ?????

( అక్రమార్కులతో అట లో శత్రువులతో వేట లో అలుపెరుగని పోరాట యోదుడు ఎన్కౌంటర్ కింగ్ విజయ్ సవాల్కర్ సాహసాన్ని, సిన్సియారిటి ని మరోసారి స్మరిస్తూ .......ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సైనికుల అభినందిస్తూ) ......

మీ

కంచర్ల అనిల్

"మహా ప్రస్తానపు వెలుగులకై అస్తమించని రవి"

కదనుత్సాహం తో తో కలం పట్టి కదం తొక్కుతున్న

యువ తెలుగు కవుల తెజోరుపం శ్రీ శ్రీ!

కమ్ముకున్న చీకట్లను, అలముకున్న అలసట్లను,

తరుముతున్న ఇక్కట్లను తరిమికొట్టే మనో ధైర్యం శ్రీ శ్రీ!

సమ సమాజపు సరిహద్దులపై

నవ నాగరికపు మొద్దులపై సందించిన అస్త్రం శ్రీ శ్రీ!

హింస ను అణచగ ధ్వంస రచనలు చేసినసమరౌత్సపు తిజిరం శ్రీ శ్రీ!

శ్రీ శ్రీ అంటేనే ఒక ఉషస్సు......

అయన కవిత్వమొక తపస్సు ...

శ్రీ శ్రీ అంటే విరిసిన మహత్తు!

విశాల జగత్తు !

అయన కవిత్వం విషం కక్కే భుజంగం ...

కదం తొక్కే తరంగం.....

ఎరుపెక్కిన రక్త సింధూరం....

ఏరులై పారిన నెత్తుటి మందారం....

నది సముద్రపు కెరటాల్లో మ్రోగిన ప్రళయ శంఖారావం శ్రీ శ్రీ !

అగ్ని సరస్సున ప్రజ్వరిల్లిన వజ్రాయుధం శ్రీ శ్రీ !

పిరంగి లో జ్వరం ధ్వనించే మృదంగ నాదం శ్రీ శ్రీ!

యుద్ధం అయన మతం

విప్లవం అయన వ్రతం

చైతన్యం అయన శాస్త్రం

ఒక కోటి జలపాతాల పాటలు

శత కోటి సముద్ర తరంగాల మోతలు అయన విశ్వరూప సాక్షాత్కారాలు.

"మరో ప్రపంచపు పరుగులకై విశ్రమించని కవి

మహా ప్రస్తానపు వెలుగులకై అస్తమించని రవి"

(గురువు గారి అడుగుజాడల్లో వెనుకడువెయ్యని వీరుడనై, ఏకలవ్య శిష్యుడనై)......

కంచర్ల అనిల్

అడగడుగునా అవినీతి,

అటు ఎటు అవినీతి,
అడగడుగునా అవినీతి,
ఎక్కడ చూసిన అదే పరిస్థితి,
ఇది బడ బాబుల జీవన రితి,
బడుగు గుండెల కన్నీటి శ్రుతి.
నిరుపేదల నిస్సహాయ స్థితి,
ఇది తరతరాల భారత జాతి దుస్తితి,
ఇది బాద్యత మరచిన జనల బాగ్య స్థితి,
విలువలు మరచిన ప్రజలు సాదించిన అఖండ కీర్తి
ఇక సాగవు ఇక సాగవు మీ అవినీతి ఆటలు
వేయండి ఇక రాక్షస క్రీడ కి బ్రేకులు
లేదంటే ఊరుకోరు ఇక యువకులు..
వాళ్ళ ఆక్రోశం గుండెల్లోంచి గుప్పెట్లోకోచే నేడు
వాళ్ళ ఆవేశం తో కళ్ళు ఎరుపెక్కేచూడు ,
మర్చండికా మురికి ప్రజల కరుకు గుండెలను,
మారని వారిపై తప్పదు మా పోరాటం!
ఇది రగిలే గుండెల ఆరాటం!
అవినీతి పై అలుపెరుగని పోరాటం ....
అంకితం
"అవినీతి పై ఎదురుతిరిగిన ప్రతి యువకుడొక సైనికుడునవయుగ వైతాళికుడు "
కంచర్ల అనిల్

"మనసే ఒక రుణం! మహాదారుణం" !

వెదనే వెగటుగా ఉన్న..

వలపురుచి తియ్యన...

చితికి నే చేరువుతున్న..

బ్రతికే నిను చేరనా!

"మనసే ఒక రుణం!

మహాదారుణం" !

రచయిస్తానొక రక్తాక్షరం ..

అనునిత్యం వెంటాడే నీ కలల సాక్షిగా .....

వేదనే జీవితం.....

నీ ప్రేమకే అంకితం ....

కంచర్ల అనిల్ కుమార్ చౌదరి

Thursday, December 4, 2008

"నింగికెగసిన చదువుల తల్లి ఆశల సౌధాలు” ...

మొన్న ....

సౌమ్య రెడ్డి

నిన్న ...శ్రీనివాస్

నేడు ....అర్పణ

ఇది పరాయి దేశం లో చదువుల తల్లి కి జరిగిన రక్త తర్ఫన ......”

వీళ్ళంతా రాలిపోయిన విధ్య కుసుమాలు...

నింగికెగసిన చదువుల తల్లి ఆశల సౌధాలు” ...

చదువే లక్ష్యం గా...భవితే ద్వేయంగా .....

తపనే మార్గం గా ...

కన్నవాళ్ళ కలలే ఆదర్శంగా ....

గమ్యం పరాయి దేశానికి పరుగులు తీస్తే...

విధి వెక్కిరిస్తే...విషనాగులు కాటేస్తే....

చదువుల తల్లి ఒడి చేరిన వెలుగు.....

నిన్నటి దాక సియోతెల్ మైక్రోసాఫ్ట్ లో కళ కళలాడిన నీ చిరునవ్వు అంతలోనే కనుమరుగై పోయిందా ???

కాలమే కాలనాగై కాటువేస్తే ....

కోటి కలలు కాటికేగా ఇక.... పయనం..

పట్టభద్రులని పొట్టన పెట్టుకున్న ఈ పాపం ఎవ్వరిదని నాలోని ఆవేశం ప్రశ్నిస్తే??????? .......

శవాలు నవ్వే సమాధానం చెప్పిన దేశం...శాంతి భద్రతలలో ప్రపంచానికి ఆదర్శమట?????

శాస్త్ర విజ్ఞానం లో ముందడుగు....

శాంతి భద్రతలే ఇక్కడ కరువు...”

కావాలంటే నేలకొరిగిన వీళ్లనడుగు ...

లేకపోతె నెత్తుటి తో తడిసిన ఈ నేలనడుగు”...

శవాలను చూడాలన్న సవలక్ష ఘడియలు నీరిక్షించాల్సిన పరిస్థితి...

శత్రువులకు కూడా రాకుడని దుస్థితి...

మీరు ఇక లేరన్న వాస్తవం తెలుసుకున్న చదువుల తల్లి రోదిస్తున్నది మౌనంగా .......

”పాలవాడి” నుంచి “పాలించె వాడి” దాక తెలుగోడి తెలివితేటల మిద అదారపడ్డ ఈ పరాయి నా కొడుకులు జాతి వివక్ష తో ఆశ జ్యోతుల ప్రాణాల హరిస్తే .....

నిగ్గదీసి నేనడుగుతాను....”

చదువు దే జాతి ....

ప్రతిభ దే కులం...

భవిత దే మతం”

అని

రుణం " తిర్చుకోవాల్సిన త "రుణం" లో జరిగిన ధా "రుణం"

ఎన్నో ఆశలు మీ మిద పెట్టుకొని , ఎన్నో కలల కోటలు మీ చుట్టూ కట్టుకొని ....

కన్నా వాళ్ళ కలలే కన్నీటి కి బలి అయితే....

మమకారం మృగాల చేతిలో మరణిస్తే..

మీ మరణ వార్త తెలుసుకున్న ఈ మమతానురాగాల మాతృభూమిలో ....

మూగ జీవాలు సైతం గుండె పగిలేలా రోదిస్తాయి .

మానవత్వం మరచిన మృగాలను ఇకనైనా మారమని భోదిస్తాయి ......

కడుపు తీపి కన్నీళ్ళలో కరుగుతున్న వైనం చూడు..

మమకారం మంటల్లో మరుగుతున్న మైనం నేడు....

కన్నా కూతురికి కన్యాదానం చేయాలనుకున్న ఈ తండ్రి ఆశ అత్యాశే అయితే....

గుండెలపై ఎత్తుకు పెంచిన నీ అన్న గుండె పగిలేలా ఏడిస్తే...

గోరు ముద్దలు తినిపించిన నీ తల్లి ని చావూ వార్త విని చావూ బ్రతుకులతో పోరాడుతుంటే...

ఓదార్పే లేని ఈ తీర్పులో .........

మీ కన్నా వాళ్ళ కన్నీళ్లను తుడిచే బంధువుని కాకపోయినా ......

మీ అకాల మరణానికి చింతించే ఒక అశ్రు బిందువునవుతూ.....

కవిత్వం నిండిన కన్నీళ్ళతో .......

కన్నీళ్ళు నిండిన కవిత్వం తో ...

మీ

కంచర్ల అనిల్

(అంకితం .....అమెరికా లో చదువుల బడి లో చనిపోయి ....చదువుల తల్లి ఒడి చేరిన తెలుగు తేజలందరికి.....అంకితమిస్తూ...... )

"ఇది ఓ అ(సమర్దుని) జీవయాత్ర" ...

అపజయమే నా పయనమై ....
నేను వేసే ప్రతి అడుగు ఆగిపోతే....
ఓటమి నా కంటే ముందుగా సాగిపోతే....
కష్టాలు, కన్నీళ్ళతో నా మది నిండిపోతే...
ఓదార్చే స్నేహాల కోసం....
భుజం తట్టి ధైర్యం చెప్పే నేస్తాల కోసం.....
ఈ నిశిధి రాత్రి లో ....
నిశ్చల దాత్రి లో......
ఒంటరినై వేచిచూస్తే .....
ఓటమి కౌగిట్లో నిద్రిస్తే ....
ఉషోదయం ఒకటి నన్ను తట్టిలేపింది....
వర్తమానం లోకి కొట్టి పంపింది...
బల్లున్న కళ్ళు తెరిచి చూస్తే నేనున్నది ..
గమ్యం తెలియని దారులలో....తీరం చేరని నావలలో....
మమత కరువై , మనసు బారమైశూన్యం లోకి చూస్తూ ఉండిపోయాను....
మౌనం గా రోదిస్తూ నిండిపోయాను.....
"అందుకే నాదేప్పుడు ఓటమిదారే...
నేనెప్పుడు ఒంటరి బాటసారే ...."
ఈ అపజయాలే నాకు నేస్తాలు.....
అందుకు ఈ అశ్రువులే సాక్ష్యాలూ.....
అందుకే చెరిగిన కలలే నాకు ఇష్టం....
పడి లేచే అలలే నాకు ఆదర్శం..
ఆగకపొంగే అశ్రువుల్ని మదిలోనే దాచాలి...
మదిలో రేగిన ఆశలతో మును ముందుకు సాగాలి..
విధి అడిన" గెలుపు -ఓటమి" విష నాటిక లో మిగిలాను ...
నేను ...."రాగం లేని గేయం గా...భావం రాని కావ్యంగా"
"నా నిస్సహాయాతని ని కాలం చూస్తుంది దీనంగా.
నా వైపల్యానికి దీపం నవ్వుతుంది హీనంగా"...
నా గతమొక రణరంగం....
గెలుపే ఎరుగని చదరంగం...
దుఃఖాన్ని సైతం చిరునవ్వు తో తుడిచేసుకుంటాను.
"అపజయాల శిదిలపై అనుభవాల జ్ఞాపకాలతో" ...
కాలం విసిరిన కన్నీటి చీకట్లలోఓటమి పరచిన వెన్నెల తోటలలో....
రేపటి వెలుగుల కోసం ప్రయనిస్తాను......
ఓటమి కౌగిలిలో గెలుపు ను ప్రేమిస్తాను....
వేగు చుక్కలు వెక్కిరించగా.
నలు దిక్కులు దీక్కరించగా ...చేస్తాను
"అపజయాలతో అలుపెరుగని రధయాత్ర"....
"ఇది ఓ అ'సమర్దుని' జీవయాత్ర" ...
కంచర్ల అనిల్

నీ కోసం...

నీ కోసం.........

నేడు ,

నా కోసం నువ్వు లేవని తెలిసి,

నీ కోసం నేను కాదని తెలిసి,

మొన్న బడిలో ,

నిన్న గుడిలో,

ఈ జీవన సుడిలో తిరగడమెందుకు?

ఇలా అందరిని అడగడమెందుకు?

కంచర్ల అనిల్

"నేను, కన్నీళ్ళు తప్ప"..

నేస్తమా!
ఈ ఎదురుచూపులు అనే దారిలోఒంటరి గా నన్ను వదిలి వెళ్ళిపోతే ...
వెచ్చని నా గుండెలో చిచ్చు రగులుకోని.
నీ జ్ఞాపకాల మంటలు నన్ను దహించివేస్తాయి...
నీ విరహాగ్ని లో కలలు సైతం కరిగిపోతాయి..
కన్నీళ్ళ వరదలవుతాయి.
నువ్వు లేని నాడు హృదయమొక ఎడారి....
పచ్చదనమే లేని కన్నీటి దారి ...
ఈ ఎడారి లో కవితలు ఉండవు, కలలు ఉండవు...
"నేను, కన్నీళ్ళు తప్ప"..
నీ చిరునవ్వుల బాకులు నా చిరు గుండెకు గాయం చేస్తే...
అగకపొంగిన రుధిరం నీతో ప్రణయానికి పరిహారం...
మన స్నేహానికి ప్రాకారం ....
"ఉష లేని ఈ నిశీ" లో నా శ్వాస ఆగిపోతే??????
మరుజన్మకైనా కరునిస్తావనినీరిక్షిస్తాను .....
"నీ కంటి పాపల్లో" .
"నా గుండె లోతుల్లో"
కంచర్ల అనిల్

నిదుర రాని నిశిది రాత్రిలో నెచ్చెలి కై నీరిక్షణ!!

నిదుర రాని నిశిది రాత్రిలో నెచ్చెలి కై నీరిక్షణ!

నింగిలోని చుక్కల్లో అన్వేషణ!

మది దోచిన మధుర స్వప్నం మబ్బులు విడి,

మనసు తెరలు దాటి హృదయపు తీరం చేరుతుందన్న ఆశ .....

ఆశ తో వేచిఉన్న నా మనసుకు తెలియదు ఇది కల అని నీ వలుపుల వల అని!

ఎదురుచూస్తున్నా నా మనసుకు విసుగు రాదు

ఇదంతా నీ లేత మనసుకు అర్ధం కాదు !

ఇది వలపు వగపు మధ్య జరుగుతున్న ఘర్షణ!

మనిషి మనసు మధ్య సంఘర్షణ !

నా వలపుల తలపును నిజం చేస్తావో

నా కలలను కల్లలు చేస్తూ కత్తులు దుస్తావో!

నిర్ణయం నీది!

జీవితం నాది !

కంచర్ల అనిల్

అలనై అందని కల కోసం బ్రతుకుతున్నా!

నేస్తమా!

నీ నీలికన్నుల్లో మెరిసే తారకలు

నీ లేత నవ్వుల్లో విరిసే మల్లికలు

నా యదలో చేసెను ఎన్నో బాసలు

నా మదిలో రేపెను ఎన్నో ఆశలు

నీ మూగ సైగలలో వలపే వల్లువగా

నీ మౌన బాషలలో తలపే పల్లవిగా

ప్రతిక్షణం నీకై జపిస్తున్న, పరితపిస్తునా,

నీ ఉహల్లో క్షణమొక యుగంగా నిరీక్షిస్తున్నా!

నీరాశే వెనకడుగు వెయిస్తున్నా నీ కోసం ఆశలతో పయనిస్తున్నా!

కల కానీ నా వలపును కన్నీటి కి బలిచేయకే చెలి!

కనరాని నీ ఉహలతో కబలించకే నను మళ్లీ!

నీ జ్ఞాపకాల లోయలలోనిజం కానీ కల కోసం నే వెదుకుతున్నా

నీ ఉహల ఉప్పెనలోఅలనై అందని కల కోసం బ్రతుకుతున్నా!

వేచిఉన్న నా కనులకు తెలుసు ఈ విరహమెంత తియ్యనిదో?

దాచుకున్న నా మనసుకు తెలుసు నీ వలపెంత తియ్యనిదో?

చిరు శ్వాసల చెలి ఉసుల సవ్వడిలో,

మరుమల్లెలు మనసిచ్చిన నీ ఓడిలో,

సేదదిరాలని కడసారి కోరిక!

అందుకే నిశబ్దాల నిగంటువులు దాటి,

ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని,

"ఈ నిరశామయ లోకంలో నీ కోసం నీరిక్షిస్తున్నా" !

నువ్వువస్తావని!

నీ

కంచర్ల అనిల్

విజయం కోసం ముందడుగు వెయ్యరా మొండిగా జగమొండిగా .......

ఎన్నాళ్ళు ఈ నిరాశపు చీకట్లు!

ఎన్నేళ్ళు ఈ నిస్తేజపు ఇక్కట్లు

వేకువ రావాలి...

వేదన తీరాలి ....

తగిలే ప్రతి గాయం తో పైకెదుగు....

రగిలే హృదయం తో విదిని గెలిచెందుకు...

రానియ్యకు కన్నీళ్ళ వర్షం ....

కానియకు కలలను కన్నిటికి దాసోహం ..

ఉండాలోయ్ దిశానిర్దేశం ..

అటుపై జరగాలి అపజయాలతో అలుపెరుగని పోరాటం..

ఇక కురవాలి నిప్పుల వర్షం....

అడియాసల సంద్రం నిండగా.జగమంత సౌఖ్యం పండగ
విజయం కోసం ముందడుగు వెయ్యరా మొండిగా జగమొండిగా .......

అల్ ది బెస్ట్



కంచర్ల అనిల్ కుమార్ చౌదరి

ఎటు చూసిన నీ రూపమే....

చెలియా....

ఎటు చూసిన నీ రూపమే....

నాలో ప్రతి అణువు నీ కోసమే...

నే వేసే ప్రతి అడుగు నీ వైపేనే రాసే ప్రతి పదం నీ చూపే ....

దీపాన్ని వెలుగుతుంట నీ కన్నీటి మంటల్లో....

జ్ఞాపకానై మెదులుతుంట నీ మనసు పొరల్లో

గతాన్నై వెంటడతాను నీ హృదయలయల్లో!

ఈ చీకటి విసిరేసిన వెన్నెల రాత్రుల్లో ...

నీ వెచ్చని శ్వాసలు నిండిన గాలులలో..

నను తాకిన ప్రతి క్షణం నీ రూపం నా గుండెల్లో పదిలం...

తరంగమల్లె వెనక్కి వెళ్ళిన మన జ్ఞాపకాలన్నీఇక ఉదయించాలి..

ఈ మూగబోయినా మనస్సులో ......ఆగిపోయిన గుండెలో ..

మళ్లీ వలపు మెరుపు మెరిసి ...తలపు జాడి వాన కురవాలి....

కంచర్ల అనిల్

"మిగిలిన కధలో,పగిలిన ఎదలో"

దివ్వె దివ్వెలలో నీ నవ్వుల రూపం కనబడితే!

పువ్వు పువ్వులో నా మనసు నీ కోసం పరుగిడితే!

నువ్వు అందని జాబిలివై నింగిలో నిద్రిస్తుంటే!

ఆకాశం లేదిక్కడ అది ఉన్నదీ నీ పక్కన!

నీ మూగ చూపులలో చెలరేగే వలపులలో

నీ మౌన బాషలలో సుడిరేగే తలపులలో....

నా మనసులోని ఉషస్సు కారుచీకట్లై కగిగిపోతే"

మిగిలిన కధలో,పగిలిన ఎదలో"

"ఉన్నాను నేను మౌనంగా!

కన్నులు దాటని కన్నీరుగా"

కంచర్ల అనిల్

నా "గతం" -కంచర్ల అనిల్

జ్ఞాపకాల సంకెళ్ళు తెంచుకొని గతం వైపు పరుగులు తీస్తున్నాను ....
చేజారిన కలల చివరి చూపుల్లో చిరునవ్వులు వెదుకుతున్నాను...
ఆ చూపుల బాకులు నా రేపటి ఆశల ఆనవాళ్లు అనుకున్న....
అవి ముళ్ళు అని ఈనాడే తెలుసుకున్న ...
నువ్వు చేసిన గాయం మానదు.....
ఈ యదలో జ్వాల ఆరదు ...
తొలి ప్రేమ కి ఫలితం ఈ కన్నీరు ....
పగిలిన హృదయం చెప్తుంది నీ పేరు ...
మనసులో నిరాశలే రచించిన కన్నీటి గీతిక....
నా పగిలిన హృదయమే ఇక చివరి ప్రణయ వేదిక ......
ఎదురుగా ఉహల సంద్రం ....
ఎక్కడో మరి నా ఆశల తీరం ...
గమ్యం తెలియదు...
అయిన గమనం ఆగదు...
ఎన్నో ఆశలు నీతో పంచుకోవాలని ...
ఎన్నో ఉసులు నీతో చెప్పుకోవాలని ...
కన్నీటి కడలి లో .....కష్టాల నావలో......
కాలమనే తీరం లో నే ఎదురుచూస్తున్నా ....
నువ్వు కలవై కనిపిస్తే ఈ కాళరాత్రి లో....
కన్నీళ్ళ కలలను నీ ముందు పరచాలనుకున్న.......
కాని మౌనం మంచు తెరలు మన మనసుల మధ్య ...."
నిశబ్ధం నీకు________ నాకు మధ్య" ....."
నిశబ్దాన్ని చిలుస్తూ నింగికెగసిన కెరటం ....
నిదుర నది లో కరిగిపోయిన నా స్వప్నం" ....."
కన్నీళ్ళలో కలల్ని కడిగేసి...
పగిలిన యదలో ప్రణయాన్ని చెరిపేసి"హృదయం లేని మనిషి లా బ్రతుకుదమంటే...
ఉదయాన్నే నీ తలపుల గతం తలుపు తట్టి లేపుతుంటే....
"పలికింది నా' గతం'
ఇక మరణానికి స్వా'గతం" ....
మీ

కంచర్ల అనిల్

About Me

My Photo
Sri krishna Nagar,Hyderabad, Andhra Pradesh
Category of films:- As per subject /theme:- Mythological Social Folk Fantasy Mythological Fantasy Socio fantasy Science fiction Historical fantasy Children Animal Animation Stages in film making Pre-Production Production Post- production Departments in film making Direction Department Cinematography Set production Acting Make –up Costumes Sound Stunts/Fights Choreography Direction Department Apprentice Assistant Directors Associated Directors Co-Directors Director. Duties of assistant directors:- 1. Script assistant 2. Clap board operations 3. Make-up & Artist co-ordination 4. Make-up & costumes continuity 5. Hand and set properties continuity Duties of associate Directors 1. Dialogues assistant 2. Editing report 3. Action & Emotions continuity 4. set properties continuity Camera department 1. Camera assistant 2. Assistant cameraman 3. Operative Cameraman 4. Cameraman

దారి కానీ దారిలో ఎదురోస్తావ్ ....

దారి కానీ దారిలో ఎదురోస్తావ్ ....
వేళ కానీ వేళ లో గుర్తొస్తావ్..
నీది కానీ "నా మనసుని" దోచుకొని వెళ్తావ్ ..
రాయలేను ఏ కావ్యం ...
చెప్పలేను గుండెల్లో నువ్వు చేసిన గాయం ....

కంచర్ల అనిల్